• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

చెట్లు ప్రాముఖ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కార్తిక మాసం లో ఉసిరి (ధాత్రి )చెట్టు కి , తులసి కి పూజ ఎలా చేయాలి ?

తులసి ని , ఉసిరి నిడన సివాకేసవులు ఆశ్రయించి ఉంటారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా పూజ చేయాలి. 
తులసి ధాత్రి సహిత కార్తిక దామోదరాయ నమః అని పూజ చేయాలి. 

ఉసిరి చెట్టు కి పూజ ఎలా చేయాలి ?
కార్తిక మాసం లో ప్రతి రోజు / సుద్ధ చతుర్దశి రోజు / చెట్టు చుట్టూ సుబ్రం చేసి 8 వైపులా అష్టదల పద్మం వేసి గొపాదుక ముద్రలు వేసి , శంక చక్రాలు పెట్టాలి , 8 వైపులా దీపలు పెట్టాలి . పద్మ పురానమ ప్రకారం గ అయితే 108 ప్రదక్షిణాలు చేయమని ఉంటుంది , కనీసమ్ 8 ప్రదక్షిణాలు అయిన చేయాలి అని ఉంటుంది . చుట్టూ తోరబంధానం చేయమని చెపుతారు . చెట్టు కి తోరం కతేటప్పుడు కింది శ్లోకం చదువుకోవాలి . ఉసిరి చెట్టు నీడలో దీపమ్ పెటండి , కానీ కొమ్మలు కాలే లాగ కాకుండా దూరం గ పెట్టండి. 




ఉసిరి చెట్టు కింద ఎఎ దానాలు చేయాలి ?
అన్న దానం / సాలగ్రామ / గ్రంధాలు  / పసుపు కుంకుమ / దీపమ్ / వస్త్రం . కార్తిక మాసం లో ఎ దానాలు చేయవచో అనీ దానాలు ఉసిరి చెట్టు కింద చేయవచు . 

ఉసిరి చెట్టు కింద ప్రవచనాలు చెప్పిస్తే చాల మంచిది . అమ్మవారి గురించి , విష్ణు నామం , విష్ణు సహస్రనామ , శివ నామం భాగవతం , భగవధ్గీత ఏదయినా ప్రవచనం చెయించవచు. 

ఇంకా చదవండి »

అపరాజిత పూజ

విజయదసమి రోజు మద్యానం 12 దాటినా తరువాత  అపరాజిత పూజ చేయాలి . సెమీ వృక్షానికి పూజ చేసి కింద స్లోకాని చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ సెమి వృక్షం 

దగ్గరలో లేకపోతే పక్కనే ఉన్న గుడిలో  ఉంటె ప్రదక్షిణ చేయవచు లేకపోతే సెమి పత్రీ దొరికితే కూడా కింద శ్లోకం తో అమ్మవారికి పూజ చేయవచ్చు.  ఈ రోజు పెద్ద వారితో ఆసీర్వచనమ్ తెసుకునేతప్పుడు అక్షింతలతో పాటు సెమి పత్రీ కూడా ఇచ్చి ఆసీర్వచ్నమ తెసుకుంటే కూడా చాల మంచిది.


ఇంకా చదవండి »

నేరేడు దేవతా వృక్షమా?


నేరేడు అంటే జంబు వృక్షం. మనం సంకల్పం చెప్పుకునేతప్పుడు "జంబు ద్వీపం" అని చెప్పుకుంటాము. ఉన్న 7 ద్వీపాలలో, జంబు ద్వీపం 4వది. ఈ జంబు ద్వీపనికి 4 పక్కల 4 దేవత వృక్షాలు ఉంటాయి, దాని మద్య మేరు
పర్వతం (అమ్మవారు ) ఉంటుంది . ఒకపక్క కడిమి చెట్టు, నేరుడు చెట్టు, రావి  చెట్టు , మర్రి చెట్టు ఉంటాయి. ఈ జంబు వృక్షానికి ఒక పెద్ద ఏనుగు ఎంత ఉంటుందో అంట పెద్ద నేరేడు కాయలు కాస్తాయి, దాని నుంచి పారే రసం ఒక ఒక నది లాగ అక్కడ ప్రవహిస్తుంది అంట. అక్కడ నివహించే జనులు దాని తాగటం వలన ఏంటో ఎవ్వనం గా , తెజోవంతులుగా , ధర్మ బద్దులుగా ఉంటారు , రోగాలు ఉండవు , దుఖం ఉండదు. నేరుడు పండ్ల రసం ఎంత శక్తి వంతమయినది అని మన పురాణాలూ చెపుతునాయి. అలనాటి జంబు ద్వీపమె ఇప్పటి జమ్మూ అని అంటారు.

అలనాటి ట్రిచ్చి పక్కన 13km వెళితే పురాతనమయిన ఒక పెద్ద జంబూ వృక్షం కనిపిస్తుంది. ఆ జంబు వృక్షం కింద ఒక్కపుడు శివుడు తప్పసు చేసుకున్నాడు. ఆ చెట్టు కింద నుంచి నీరు ప్రవహిస్తుంది. పంచ బూతాలలో ఒకటి గ చెప్పుతారు. ఆ జంబుకేశ్వర దగ్గర దర్శనం చేసుకుని, అక్కడ ఉన్న నది లో స్నానం చేసి అబిషేక అర్చనలు చేయటం వలన పంచమహా పాతకాలు, బ్రహ్మ హత్య పాపం పోతాయి అంటారు.

వృక్ష ఆయుర్వేదం లో ఒక్కో నక్షత్రానికి ఒకో వృక్షాని చెపుతారు. చంద్రుడు రోహిణి నక్షత్రం లో ఉచ్చస్తితి పొందుతాడు, రాసి వృషభ రాశి. ఈ నేరేడు పళ్ళు తినడం వలన రోగాలు తగ్గుతాయి అని , ఇది దేవత వృక్షం అని అంటారు. ఎక్కడ నేరేడు చెట్టు ఉంటే , దాని భుఘర్భం లో తీయని నీరు ప్రవహిస్తూ ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం చెపుతుంది.

అతిసార వ్యాది ని నేరేడు బెరడు తో చేసిన కాషాయం తగ్గిస్తుంది. చిగుళ్ళు వ్యాది కి కూడా ఈ కాషాయం తాగడం వలన , నేరేడు చిగుళ్ళు తినడం వలన చిగిల్లు గట్టిపడతాయి. సంవత్సరానికి ఒక్క సరి అయిన నేరేడు పళ్ళు తినాలి అంటారు ఎందుకు అంటే, జీర్న శక్తి పెరుగుతుంది , లోపల ఎక్కడయినా అల్సర్స్ ఉంటె , మూత్రం లో రాలు ఉంటె కరిగిస్తుంది, ఆహారం లో ఎవరికీ అయిన వెంట్రుకలు ఉంటె అన్నిటిని కరిగిస్తుంది.

గర్బిని స్త్రీలు నేరేడు పళ్ళు తినకూడదు, ఎందుకంటే నేరుడికి కరిగించే శక్తి ఉంటుంది. బొంగురు గొంతుకు ఉన్నవారు నేరేడు పళ్ళు తినడం వలన, కాషాయం తాగటం వలన శ్రావ్యం గా మాట్లాడ గలుగుతారు.

తేలు కుట్టినప్పుడు నేరేడు అక్కలు రసం నలిపి కట్టడం వలన ఆ విషం ఎక్క కుండ ఆ విషాన్ని హరిస్తుంది. తెలియకుండా ఎవరయినా విషాని తింటే నేరేడు అక్కలు కాషాయం లేదా నేరేడు గింజల కాషాయం తాగటం వలన ఆ విషం హరిస్తుంది. దీనె గింజల పొడిని ఎవరు తీసుకుంటరొ, వారికీ మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. నేరేడు ని ఉప్పు ( సైధవ లవణం ) కలిపి తినటం వలన మంచి రుచి, జీర్న శక్తి పెరుగుతుంది.

ఇంకా చదవండి »

దర్భ యొక్క ప్రాముఖ్యం

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన దర్భ” (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. 
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:

విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ
ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.

ఇంకా చదవండి »